మహేష్ బాబు తో త్రివిక్రమ్ యాడ్ ఫిలిం


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుత్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు వంటి బ్లాక్ బస్టర్ వచ్చింది అలాగే ఖలేజా అనే సినిమా కూడా వచ్చింది కానీ ఖలేజా ప్లాప్ అయ్యింది . ఆ తర్వాత మళ్ళీ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అనుకుంటున్నారు కానీ ఇంతవరకు సెట్ కాలేదు . అయితే సినిమా సెట్ కాలేదు కానీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో పలు యాడ్ ఫిలిమ్స్ రూపొందాయి .

మహేష్ బాబు కమర్షియల్ యాడ్స్ కు విపరీతమైన డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే . ఇక మహేష్ బాబు చేసిన ఎక్కువ యాడ్స్ కు దర్శకులు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు . కాగా మరో యాడ్ ఫిలిం ని నిన్న షూట్ చేస్తున్నారు త్రివిక్రమ్ . దాంతో మహేష్ బాబు – త్రివిక్రమ్ ల సినిమా పై మళ్ళీ ఊహాగానాలు చెలరేగాయి . దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకవైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు యాడ్స్ కూడా దర్శకత్వం వహిస్తున్నాడు . మళ్ళీ ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందో మరి .