ఆవిరి టీజర్ ను పొగిడేస్తున్న మహేష్

mahesh appreciates aaviri teaser
mahesh appreciates aaviri teaser

అనసూయ, అమరావతి, అవును వంటి చిత్రాలతో హారర్, థ్రిల్లర్ జోనర్లలో సినిమాలు తెరకెక్కి విజయాలు అందుకున్న రవిబాబు, లేటెస్ట్ గా చేస్తున్న మరో ప్రయత్నం ఆవిరి. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే మూడు టీజర్లు విడుదలై జనాల్లో ఆసక్తి రేకెత్తించాయి. స్పిరిట్ ని కనుగొనండి అంటూ చేసిన ప్రచారం బాగా పనిచేసింది.

ఇప్పుడు ఈ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు పొగడడం ప్రాధాన్యత సంతరించుకుంది. “ప్రేక్షకులలో హారర్ చిత్రాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తాయి. అయితే ఇందులో రవిబాబు మాస్టర్ అయిపోయాడు. ఆవిరి చిత్ర యూనిట్ కి, రవిబాబుకి ఆల్ ది బెస్ట్” అని ట్వీట్ చేసారు.

అయితే ఈ టీజర్లకు పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు నెగటివ్ రెస్పాన్స్ కూడా అదే స్థాయిలో వస్తోంది. ఈ చిత్రానికి అవును పార్ట్ 3 అని టైటిల్ పెట్టుకోవచ్చని, కొత్తగా ఈ టీజర్ లో ఏం లేదని, అవును సినిమా మళ్ళీ చూసినట్లే ఉందని కొంతమంది అంటున్నారు. అయితే సినిమా విడుదలైతే కానీ ఈ సినిమా గురించి ఒక అంచనాకు రాలేం. దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తుండడం విశేషం.