మహేష్ ఎందుకని ఆ ప్యాంట్ ను వదలట్లేదు


మహేష్ ఎందుకని ఆ ప్యాంట్ ను వదలట్లేదు
మహేష్ ఎందుకని ఆ ప్యాంట్ ను వదలట్లేదు

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరులో ఆర్మీ మేజర్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. అయితే సినిమా ఓపెనింగ్ కాసేపు ఆర్మీ వ్యవహారాల్లో కనిపించే మహేష్ తర్వాత రెగ్యులర్ పంథాలోకి వచ్చేస్తాడు. కామెడీ, ఫ్యామిలీ ఎపిసోడ్స్, ఫ్యాక్షన్ ఇలా సాగుతుంది వ్యవహారం. అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంలో అల్లు అర్జున్ ఆర్మీ పాత్రలో నటించినా సినిమా మొత్తం వేరే డ్రామా ఉంటుంది. కాసేపే ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ లో నటించాడు. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరులో కూడా ఇలాంటి వ్యవహారమే కనిపిస్తోంది. ఇదంతా బానే ఉంది కానీ మహేష్ ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లలో ఆర్మీ ప్యాంట్ తోనే కనిపించాడు. అసలు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ఇప్పటివరకూ జరిగిన ప్రమోషన్స్ చాలా తక్కువ. సందర్భానికి తగినట్లు ఏవో కొన్ని పోస్టర్లు అయితే విడుదల చేసారు. ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్లు, వర్కింగ్ స్టిల్స్ అన్నిట్లోనూ మహేష్ బాబు కామాఫ్లాజ్‌ ప్రింట్‌ ఉన్న ప్యాంట్ నే ధరిస్తూ వస్తున్నాడు.

కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర మహేష్ కత్తి పట్టుకున్న పోస్టర్ విడుదల చేసినా, అనిల్ రావిపూడితో కలిసి కూర్చొన్న స్టిల్ వదిలినా, కేరళ షెడ్యూల్ పూర్తైనప్పుడు టీమ్ మొత్తం కలిసి ఫోటో దిగినా అన్నిట్లోనూ మహేష్ ఈ ఆర్మీ ప్యాంట్ తోనే ఉన్నాడు. ఎంత ఆర్మీ పాత్ర అయితే మాత్రం ఇలా ప్రతిసారి దాన్ని గుర్తుచేసేలా సందర్భంతో పనిలేకుండా ఆర్మీ ప్యాంట్ తో మహేష్ అల్లాడించేస్తున్నాడు అంటూ బహిరంగంగానే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దీనికి అనిల్ రావిపూడి వెర్షన్ వేరే ఉంది. సినిమాలో కాసేపే ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ తో కనిపిస్తాడు మహేష్. కానీ ఆర్మీ మేజర్ అన్నది సినిమాలో పలు సందర్భాల్లో ఎఫెక్ట్ ఉంటుంది. అది వచ్చినప్పుడు సడెన్ గా ఆడియన్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండేందుకు ఇలా మహేష్ చేత ఆర్మీ ప్యాంట్ ను కన్సిస్టెంట్ గా సినిమా మొత్తం వేయించాడట. ఇదెక్కడి లాజికో అర్ధం కావడం లేదు కానీ ఇలాంటి చిన్న విషయాలను పక్కనపెడితే సరిలేరు నీకెవ్వరు చాలా బాగా వచ్చిందని టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా ఇందులోని కామెడీ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తారని, కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తారని, ఇక ట్రైన్ ఎపిసోడ్ అయితే వెంకీ తరహాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదిగా ఉంటుందిట. రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ 2 తర్వాత మళ్ళీ ఆ రేంజ్ కామెడీ ఇందులో చూడొచ్చు అని అంటున్నారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ చక్కగా కుదిరినట్లు తెలుస్తోంది. మహేష్ నుండి ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలమైంది. అందుకే మహేష్ ఫ్యాన్స్ కు సంక్రాంతికి విందు భోజనం లాంటి సినిమా అని చెబుతున్నారు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా, విజయశాంతి కీలక పాత్రలో కనిపించనుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. అనిల్ సుంకర నిర్మాత.