మహేష్ ఫస్ట్ లుక్ వస్తోంది


mahesh babu 25 th movie first look gets release date

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానుల కోసం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మహేష్ 25 చిత్రంలోని లుక్ ని విడుదల చేయనున్నారు. తాజాగా మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ ని డెహ్రాడూన్ లో జరుపుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2019 ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాతలు అశ్వనీదత్ , దిల్ రాజు లతో పాటుగా పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఆగస్టు 9 మహేష్ పుట్టినరోజు కావడంతో మహేష్ అభిమానులు కోలాహలంగా పుట్టినరోజు వేడుకలను జరపడానికి సిద్ధం అవుతున్నారు. సరిగ్గా అదే సమయంలో మహేష్ లుక్ విడుదల అయితే ఫ్యాన్స్ ఆనందానికి అంతే ఉండదు. మహేష్ తో పాటు అల్లరి నరేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు భరత్ అనే నేను చిత్రం బ్లాక్ బస్టర్ కొట్టడంతో మహేష్ 25వ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రైతుల కథాంశంతో పాటు రాయలసీమ నేపథ్యం కూడా ఉంది ఈ సినిమాకు దాంతో మహేష్ బాబు ఈ సినిమాపై నమ్మకంగా ఉన్నాడు. ఆగస్టు 8 సాయంత్రమే మహేష్ లుక్ విడుదల కానుంది.

English Title: mahesh babu 25 th movie first look gets release date