కేటీఆర్ ఛాలెంజ్ ని స్వీకరించిన మహేష్ బాబు


mahesh babu accepted ktrs harithaharam challengeహరితహారంలో పాల్గొని మొక్కలు నాటాలని తెలంగాణ ఐటీ శాఖామాత్యులు కేటీఆర్ విసిరిన సవాల్ కు కాస్త ఆలస్యంగానైనా స్పందించాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు . ఎట్టకేలకు నిన్న మహేష్ బాబు తన కూతురు సితార తో కలిసి మొక్కలు నాటి కేటీఆర్ ఛాలెంజ్ ని స్వీకరించినట్లు ప్రకటించాడు . అంతేకాదు హరితహారం కార్యక్రమం చాలా మంచిదని కొనియాడాడు కూడా . మంత్రి కేటీఆర్ ఈ సవాల్ విసిరి వారం కావస్తోంది అయితే కాస్త ఆలస్యంగా స్పందించాడు మహేష్ . సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండడు అందుకే ఈ విషయం పై స్పందించడానికి మొక్కలు నాటడానికి సమయం పట్టింది .

ఇక తన తదుపరి సవాల్ ఎవరికి విసిరాడో తెలుసా …… కూతురు సితార , తనయుడు గౌతమ్ అలాగే దర్శకుడు వంశీ పైడిపల్లి లకు . హరితహారం లో పాల్గొని మొక్కలు నాటాలని ఆ ముగ్గురికి సవాల్ విసిరాడు మహేష్ , అయితే ఆ ముగ్గురిలో ఇద్దరు తన సంతానం కాబట్టి సితార , గౌతమ్ లచేత మొక్కలు నాటించే బాధ్యత మహేష్ బాబు దే ! ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25 వ సినిమా చేస్తున్నాడు . ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా ముగ్గురు నిర్మాతలు అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .

English Title: mahesh babu accepted ktrs harithaharam challenge