మహేష్ – అనిల్ రావిపూడి సినిమా ఎప్పటి నుండో తెలుసా ?


మహేష్ - అనిల్ రావిపూడి సినిమా ఎప్పటి నుండో తెలుసా ?
మహేష్ – అనిల్ రావిపూడి

మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . పూర్తిగా ఎంటర్ టైన్ మెంట్ వేలో సాగే ఈ చిత్రం కోసం మహేష్ బాబు ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు . ఇక ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం కానుందో తెలుసా ……. జూన్ చివరి వారంలో . అవును ఈ కొత్త సినిమా జూన్ చివరి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది , ఈ విషయాన్నీ మహేష్ బాబు స్వయంగా వెల్లడించాడు .

వరుసగా సందేశాత్మక ,యాక్షన్ చిత్రాలు చేసి చేసి బోర్ కొడుతోంది అందుకే అనిల్ రావిపూడి సినిమాని ఎంచుకున్నానని నాకు కూడా కొత్తగా ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నానని అంటున్నాడు మహేష్ బాబు . అనిల్ రావిపూడి ఇప్పటివరకు దర్శకత్వం వహించిన నాలుగు చిత్రాలు కూడా మంచి హిట్స్ కావడంతో మహేష్ అనిల్ తో సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడు . ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా విజయశాంతి కీలక పాత్రలో నటించనుంది .