రిలీజ్ లో బాహుబలి ని బద్దలు కొడుతున్న మహర్షి

ఓవర్ సీస్ లో మహర్షి అప్పుడే రికార్డుల మోత మోగిస్తోంది . బాహుబలి 2 రికార్డులను బద్దలు కొడుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు . అమెరికాలో మహర్షి ప్రీమియర్ షోలు ఎన్ని పడుతున్నాయో తెలుసా ……. 2500 షోలు . ప్రీమియర్ షోలతోనే రికార్డులను బద్దలు కొట్టాలని పెద్ద ఎత్తున ప్రీమియర్ షోలను ప్లాన్ చేసారు ఓవర్ సీస్ నిర్వాహకులు . అమెరికా వ్యాప్తంగా 2500 ప్రీమియర్ షోలను వేయడానికి భారీ ఎత్తున సన్నాహాలు చేసారు . ఇక అడ్వాన్స్ బుకింగ్ కు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది .

మే 8 న అమెరికాలో ప్రీమియర్ షోలు పడనున్నాయి , ఈ షోలతో బాహుబలి 2 రికార్డులు బద్దలు కానున్నాయి షోల విషయంలో . ఇక వసూళ్ల పరంగా ఎలాంటి సంచలనాలు నమోదు కానున్నాయో మే 8 న తేలనుంది . మహేష్ బాబు చిత్రానికి ఓవర్ సీస్ లో విపరీతమైన డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించింది .