తమిళనాట మహేష్ చిత్రానికి పిచ్చ క్రేజ్


 Mahesh Babu Bharat Ennum Naan super response in Tamil Naduతెలుగులో సంచలన విజయం సాధించిన చిత్రం ” భరత్ అనే నేను ” . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో 200 కోట్ల వసూళ్ల ని సాధించింది దాంతో మహేష్ చాలా సంతోషంగా ఉన్నాడు . ఇక తెలుగునాట సక్సెస్ కావడంతో తమిళంలో కూడా విడుదల చేసారు . సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని మే 31 న తమిళనాట విడుదల అయ్యింది ”భరత్ ఎన్నం నాన్ ” టైటిల్ తో . మొదటి రోజు న భారీ అంచనాలు అయితే లేవు కానీ మార్నింగ్ షో అయ్యాక పూర్తిగా పాజిటివ్ టాక్ రావడంతో ఏకంగా మరిన్ని థియేటర్ లు పెంచారు అక్కడి పంపిణీదారులు .

స్పైడర్ చిత్రంతో తమిళ ప్రేక్షకులను పలకరించాడు మహేష్ బాబు అయితే ఆ సినిమా ఘోర పరాజయం పొందడంతో భరత్ ఎన్నం నాన్ చిత్రంపై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి , కట్ చేస్తే తెలుగులో భరత్ అనే నేను చిత్రం సాధించిన విజయానికి తోడూ మంచి రివ్యూస్ కూడా రావడంతో తమిళనాట కూడా మంచి వసూళ్లు సాధిస్తున్నాడు మహేష్ బాబు . తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన భరత్ అనే నేను తమిళ్ వెర్షన్ లో కూడా హిట్ దిశగా దూసుకుపోతోంది .