డిజాస్టర్ సినిమాని మహేష్ రీమేక్ చేయనున్నాడా


mahesh babu bollywood debut with spyder

తెలుగులో వచ్చిన స్పైడర్ మహేష్ బాబు కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది అలాంటి సినిమాతో బాలీవుడ్ లో కెళ్లనున్నాడు అని తాజాగా వార్తలు అందుతున్నాయి దాంతో ఈ వార్త విన్నవాళ్లకు నిజంగా షాకింగ్ న్యూసే ! తెలుగు , తమిళ బాషలలో స్పైడర్ చిత్రం రూపొందింది . మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో అట్టర్ ప్లాప్ కాగా తమిళనాట మాత్రం కొద్దిగా బెటర్ కలెక్షన్లు వచ్చాయి .

అయితే మురుగదాస్ మాత్రం తాజాగా స్పైడర్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . తెలుగు , తమిళ్ లో మహేష్ చేసాడు కాబట్టి హిందీలో కూడా మహేష్ చేస్తే బాగుంటుందిఅని అంటున్నాడట ! తెలుగులో ఘోర పరాజయం పొందిన సినిమా ని రీమేక్ చేయడం ఏంటి ? అందులో మహేష్ బాబు హీరోగా మళ్ళీ నటించడం ఏంటి ? అని ఫ్యాన్స్ షాక్ అవ్వడం ఖాయం . ప్రస్తుతం మహేష్ రెండు సినిమాలతో బిజీ గా ఉన్నాడు కాబట్టి హిందీ స్పైడర్ లో నటించడం దాదాపుగా అనుమానమే !