మహేష్ డిజాస్టర్ సినిమా అక్కడ రిలీజ్ కి రెడీ


Mahesh babu brahmotsavam tamil version gets release date

మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత చెత్త చిత్రంగా రికార్డులు సృష్టించింది బ్రహ్మోత్సవం చిత్రం . 2016 లో విడుదలైన ఈ చిత్రాన్ని తాజాగా తమిళనాట విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఈ చిత్రానికి అక్కడ టైటిల్ ఏంటో తెలుసా …….. అనిరుధ్ . శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే కాగా ఆ బ్రహ్మోత్సవాన్ని అనిరుధ్ పేరుతో భద్రకాళి ఫిలిమ్స్ విడుదల చేస్తోంది . మహేష్ సరసన సమంత , కాజల్ అగర్వాల్ , ప్రణీత లు నటించగా సత్యరాజ్ కీలక పాత్ర పోషించాడు .

మహేష్ తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడే అలాగే సమంత , కాజల్ అగర్వాల్ , ప్రణీత లతో పాటుగా సత్యరాజ్ ఉన్నాడు కాబట్టి ఓ మోస్తరు వసూళ్లు రావచ్చు దాని తర్వాత పరిస్థితి ఏంటో మరి . ఇక ఈ సినిమాని ఆగస్టు 3న విడుదల అనుకున్నారు కుదరలేదు దాంతో ఆగస్టు 10న అనుకున్నారు కానీ కమల్ విశ్వరూపం 2 విడుదల కాబట్టి వాయిదా వేశారు ఎట్టకేలకు ఆగస్టు 17న అనిరుధ్ విడుదల అవుతున్నాడు . రిలీజ్ అయితే అవుతోంది కానీ డౌటే ……. విజయం . మహేష్ కున్న క్రేజ్ ని సొంతం చేసుకోవడానికి రిలీజ్ చేసున్నారు అంతే !

English Title: mahesh babu brahmotsavam tamil version gets release date