రిస్క్ చేస్తున్న మహేష్ బాబు బావ


mahesh babu brother in law sudheer babu in experimental modeటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బావ హీరో సుధీర్ బాబు రిస్క్ చేస్తున్నాడు . హాయిగా సినిమాలలో హీరోగా నటిస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకోకుండా నిర్మాతగా మారి సినిమాలు నిర్మించడానికి కంకణం కట్టుకుంటున్నాడు . నిర్మాతగా మారితే రిస్క్ ఎందుకు , సినిమా హిట్ అయితే డబ్బులు వస్తాయిగా అని అనుకుంటారు కానీ సినిమాలు నిర్మించి కోట్లకు కోట్లు డబ్బులు సంపాదించిన నిర్మాతలు కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు . 90 వ దశకంలో అలాగే ఓ పదేళ్ల క్రితం నిర్మాతగా మారిన వాళ్ళు డబ్బులు సంపాదించారు కానీ ఇప్పుడు నిర్మాతల పరిస్థితి పూర్తిగా మారిపోయింది .

థియేటర్ లు కొంతమంది చేతిలో ఉన్నాయి , అలాగే బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతోంది హిట్ అయితే పేరు వస్తోంది కానీ పెద్దగా డబ్బులు రావడం లేదు . కలెక్షన్లు బాగానే కనిపిస్తాయి కానీ అవేవి నిర్మాత చేతిలోకి రావు ఎందుకంటే రకరకాల ఖర్చు చూపించి మిగిలినది ఉంటే అప్పుడు పంపిస్తారు పంపిణీదారులు . నాలుగైదు బ్లాక్ బస్టర్ లు తీసి ఒక్క డిజాస్టర్ ఇచ్చినా నిర్మాత పొజీషన్ మారిపోతోంది . ఇలా దెబ్బ తిన్న నిర్మాతల లిస్ట్ లెక్కపెట్టడానికి టైం సరిపోదు ఎందుకంటే ఒక సంవత్సరంలో 150 కి పైగా సినిమాలు విడుదల అవుతాయి కానీ హిట్స్ కనీసం పది కూడా ఉండవు అంటే మిగతా 140 సినిమాలు అలాగే ఆ చిత్రాలను నిర్మించిన నిర్మాతల పరిస్థితి దారుణంగా ఉంటుంది . హాయిగా హీరోగా నటిస్తూ నాలుగు రాళ్లు వెనకేసు కోవాల్సిన సుధీర్ బాబు నిర్మాతగా మారి రిస్క్ చేస్తున్నాడు . అయితే కాలం కలిసి వస్తే హిట్ చిత్రాల నిర్మాత అవుతాడు లేదంటే ……. ?