సినీజీవుల కోసం మరో రూ.25 లక్షలు – మహేష్ బాబు


సినీజీవుల కోసం మరో రూ.25 లక్షలు – మహేష్ బాబు
సినీజీవుల కోసం మరో రూ.25 లక్షలు – మహేష్ బాబు

మహేష్ బాబు తన సంపాదనలో దాదాపు 30 శాతం ప్రతి ఏటా సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడతారనీ ఇండస్ట్రీ లో ఒక ప్రచారం ఉంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారు అయితే గతంలో సినిమా నష్టపోయిన నిర్మాతలకు పిలిచి మళ్ళీ సినిమాలు ఇచ్చిన గొప్ప మనిషి. పేద పిల్లలకు ఆపరేషన్లు, తని ఊరిని దత్తత తీసుకోవడం లాంటి కార్యక్రమాలతో ఇప్పటికే నిజజీవితంలో కూడా శ్రీమంతుడు అనిపించుకున్న మహేష్ బాబు ఇప్పుడు మళ్ళీ మరొక అడుగు ముందుకు వేశారు.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలకు ఇప్పటికే రూ.1 కోటి విరాళం ప్రకటించిన మహేష్ గారు.. సినిమా ఇండస్ట్రీలో కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పటికే ఉపాధి అవకాశాలు కోల్పోయిన కార్మికుల సంక్షేమం కోసం మరో రూ.25 లక్షలు ప్రకటించారు.

“ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితి సినీపరిశ్రమ మీద ఆధారపడిన రోజువారీ కార్మికులపై భారం కలిగిస్తుంది. నా వంతు ప్రయత్నం నేను చేసాను. ఈ కష్ట సమయంలో ఇతర నటీనటులు కూడా స్పందించమని కోరుతున్నాను.” అని భావోద్వేగభరితంగా ట్వీట్ చేసారు మహేష్ బాబు.

Credit: Twitter