పోర్చుగల్ లో ఎంజాయ్ చేస్తున్న మహేష్


వేసవి విడిది కోసం పోర్చుగల్ వెళ్లిన మహేష్ బాబు అక్కడ తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు . కూతురు సితార కొడుకు గౌతమ్ లతో కలిసి మహేష్ బాబు కూడా చిన్న పిల్లాడైపోయాడు . పిల్లలతో కలిసి ఆడుకుంటూ సంతోషంలో మునిగి తేలుతున్నాడు మహేష్ . భార్య పిల్లలతో కలిసి పోర్చుగల్ వెళ్లిన మహేష్ అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసి తన సంతోషాన్ని అభిమానులకు కూడా పంచుతున్నాడు .

ఇటీవలే మహర్షి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . ఈ నెలాఖరున కృష్ణ పుట్టినరోజున మహేష్ బాబు కొత్త చిత్రం ప్రారంభం కానుంది . మహేష్ సరసన ఒక భామగా రష్మిక మందన్న ని ఎంపిక చేయగా మరో భామని ఎంపిక చేయాల్సి ఉంది . ఇక కీలక పాత్రల్లో విజయశాంతి , రమ్యకృష్ణ లు నటించనున్నారు మహేష్ బాబు కొత్త చిత్రంలో .