మందు పార్టీలో మహేష్ బాబు


Mahesh babu enjoying liqueur party in dubai
కొత్త సంవత్సర వేడుకల కోసం కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లిన మహేష్ అక్కడ తన మిత్రులతో కలిసి మందు పార్టీలో మునిగి తేలుతున్నాడు . ఫ్యామిలీతో ఫారిన్ వెళ్లిన మహేష్ బాబు కి గట్టి షాక్ ఇచ్చింది ఐటీ శాఖా అయితే ఆ షాక్ నుండి ఇంకా మహేష్ బాబు తేరుకోలేదు కానీ వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి కాబట్టి ఆ పని చేస్తున్నాడు . ఇక ఈరోజు న్యూ ఇయర్ పార్టీ హడావుడి అంతా దుబాయ్ లోనే అని ట్వీట్ చేసాడు మహేష్ బాబు .

తన మిత్రులతో కలిసి మందు పార్టీలో మునిగిన మహేష్ అంతకు ముందే ఫోటోలకు ఫోజిచ్చి ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టేసాడు . మహేష్ ని ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈ ఫోటో వైరల్ అవ్వడం ఖాయం . న్యూ ఇయర్ వేడుకల తర్వాత తిరిగి ఇండియాకు తిరిగి రానున్నాడు మహేష్ బాబు . వచ్చాక మహర్షి చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉంటాడు . ఏప్రిల్ 5 న మహర్షి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: Mahesh babu enjoying liqueur party in dubai