పూరి జగన్నాధ్ ని తిడుతున్న మహేష్ ఫ్యాన్స్


Puri Jagannadh
Puri Jagannadh

మహేష్ బాబు ఫ్యాన్స్ దర్శకులు పూరి జగన్నాధ్ ని తిడుతున్నారు . మహేష్ ఫ్యాన్స్ కు పూరి జగన్నాధ్ అంటే ఇష్టం కానీ ఆ ఇష్టం కాస్త కోపంగా మారింది ఎందుకో తెల్సా …….. మహేష్ బాబు నాతో సినిమాలు ఎందుకు చేస్తాడు ….. హిట్ ఉంటేనే చేస్తాడు అని మహేష్ బాబు ని విమర్శించడమే ! దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కు విపరీతంగా కోపం వచ్చిందిఅందుకే పూరి ని ట్రోల్ చేస్తున్నారు . అంతేనా నువ్ ప్లాప్ లలో ఉన్నప్పుడే నీకు మహేష్ బాబు సినిమాలు చేసే ఛాన్స్ ఇచ్చాడు అది కూడా రెండుసార్లు అంటూ ట్రోల్ చేస్తున్నారు .

నిజమే ! మహేష్ బాబు ఫ్యాన్స్ చెప్పేది ఎందుకంటే పోకిరి సినిమాకు ముందు వరుసగా పూరి జగన్నాధ్ కు ప్లాప్ లు వచ్చాయి , అప్పుడే మహేష్ ఛాన్స్ ఇచ్చాడు కట్ చేస్తే ఇండస్ట్రీ హిట్ వచ్చింది . అలాగే బిజినెస్ మెన్ చిత్రానికి ముందు కూడా పూరి జగన్నాధ్ కు వరుస డిజాస్టర్ లు . అప్పుడు కూడా మళ్ళీ మహేష్ ఛాన్స్ ఇచ్చాడు కట్ చేస్తే బిజినెస్ మెన్ సూపర్ హిట్ వచ్చింది . అంటే పూరి ప్లాప్ లలో ఉన్నప్పుడే మహేష్ ఛాన్స్ ఇచ్చాడు కానీ హిట్స్ కొట్టినప్పుడు కాదు . పూరి జగన్నాధ్ వికీ లో చూస్తే ఆ విషయం చాలా స్పష్టం అవుతుంది . పోకిరి ముందు , బిజినెస్ మెన్ ముందు పూరి సినిమాల లిస్ట్ చూడండి చాలు .