రాజమౌళి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహేష్ ఫ్యాన్స్


Mahesh babu fans fires on Rajamouli

దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ . మహేష్ బాబు అభిమానులకు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా …….. మహేష్ బాబు తో సినిమా చేస్తానని రాజమౌళి ఎప్పటి నుండో అంటున్నాడు కానీ సినిమా మాత్రం పట్టాలెక్క లేదు ఆ విషయాన్ని పక్కన పెడితే తాజాగా ఎన్టీఆర్చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నాడు అందులో చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు .

 

అల్లూరి సీతారామరాజు గా కృష్ణ అద్భుత అభినయం ప్రదర్శించిన విషయం తెలిసిందే . అయితే కృష్ణ వారసుడుగా ఇప్పటి అల్లూరి సీతారామరాజు పాత్రలో మహేష్ బాబు ని తీసుకోవాల్సింది పోయి చరణ్ ని అల్లూరి సీతారామరాజు గా తీసుకోవడం ఏంటి ? అని నిప్పులు చెరుగుతున్నారు మహేష్ బాబు అభిమానులు . చరణ్ ని కాకుండా మహేష్ బాబు చేత అల్లూరి సీతారామరాజు పాత్ర చేయించి ఉంటే బాగుండేదని భావిస్తున్నారు కృష్ణ – మహేష్ అభిమానులు . ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీం గా చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు .

English Title: Mahesh babu fans fires on Rajamouli