యుద్ధం ప్రకటించిన మహేష్ బాబు ఫ్యాన్స్


mahesh babu fans fires on tamil actor

మహేష్ బాబుకు యాక్టింగ్ రాదని ఘోరంగా అవమానించిన తమిళ నటుడు మనోజ్ ప్రభాకర్ పై మహేష్ బాబు అభిమానులు యుద్ధం ప్రకటించారు . తమిళ మీడియాతో మాట్లాడుతూ మహేష్ బాబుకు యాక్టింగ్ రాదని , ఎస్ జె సూర్య స్పైడర్ చిత్రంలో అద్భుతంగా నటిస్తుంటే దానికి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో తెలీక మహేష్ ఇబ్బందిపడ్డాడని సంచలన వ్యాఖ్యలు చేసాడు మనోజ్ ప్రభాకర్ . అసలు తమిళ్ లో ఈ నటుడు పెద్దగా ఎవరికీ తెలీదు ఓ జూనియర్ ఆర్టిస్ట్ లాంటి వాడు అయితే ఎవరిపైన అయినా విమర్శలు చేస్తే ఈజీగా మీడియాలో నానుతాడు కాబట్టి మహేష్ బాబుపై కామెంట్ చేసాడు వార్తల్లో నిలిచాడు .

తమ అభిమాన హీరోని ఘోరంగా అవమానించిన మనోజ్ ప్రభాకర్ ని ఉపేక్షించేది లేదంటూ అతడ్ని బూతులు తిడుతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ . ఒకరకంగా మనోజ్ ప్రభాకర్ పై యుద్ధం ప్రకటించారు మహేష్ ఫ్యాన్స్ . మహేష్ బాబు తమిళంలో స్పైడర్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే . అయితే ఆ సినిమా ఘోర పరాజయం పొందింది , కానీ ఎస్ జె సూర్య కు మాత్రం చాలామంచి పేరు వచ్చింది విలన్ గా . మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ అయ్యింది . అయితే తమిళంలో నేరుగా చేసిన సినిమా కాబట్టి అంతటి దారుణమైన కామెంట్ చేసాడు మనోజ్ ప్రభాకర్ అనే జూనియర్ ఆర్టిస్ట్ .

English Title: mahesh babu fans fires on tamil actor