మహేష్ బాబు సీరియస్ అయ్యాడట


Mahesh babu fires on rumours

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాపై వస్తున్న వార్తల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడట దాంతో హుటాహుటిన ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు మహర్షి సినిమా ఏప్రిల్ 25 న రిలీజ్ అవుతోంది , ఆలస్యం అయ్యే ప్రసక్తి లేదు అంటూ . అసలు విషయం ఏంటంటే మహర్షి చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదాపడుతూ ఏప్రిల్ 25 అని డేట్ ప్రకటించిన విషయం తెలిసిందే .

 

అయితే ఓ మూడు నాలుగు రోజలుగా మళ్ళీ మహర్షి వాయిదాపడింది అని వార్తలు వచ్చాయి , అవి మహేష్ చెవిన పడటంతో సీరియస్ అయ్యాడట ! మహర్షి సినిమా ఏప్రిల్ 25 న రావాల్సిందే అని గట్టిగా చెప్పాడట . ఏప్రిల్ 25 అంటే ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి రిలీజ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రశ్నించాడట . ఇంకా 55 రోజులకు పైగా సమయం ఉంది కాబట్టి పెండింగ్ పనులన్నీ పూర్తిచేయండి అని ఆదేశాలు జారీ చేసాడట మహేష్ . అందుకే ఏప్రిల్ 25 నేరిలీజ్ అంటూ  ప్రెస్ నోట్ పంపారు .

English Title: Mahesh babu fires on rumours