బ్లాక్ బస్టర్ కొట్టేసిన మహేష్


Mahesh babu happy with bharath ane nenu resultమహేష్ బాబు బ్లాక్ బస్టర్ కొట్టేసాడు భరత్ అనే నేను చిత్రంతో . బ్రహ్మోత్సవం , స్పైడర్ చిత్రాలు ఘోర పరాజయం పొందడంతో మహేష్ పై తీవ్ర ఒత్తిడి నెలకొంది అయితే కొరటాల శివ దర్శకత్వంలో మళ్లీ సినిమా ఒప్పుకోవడంతో తప్పకుండా మహేష్ సూపర్ హిట్ కొడతాడని నమ్మకం పెట్టుకున్నారు మహేష్ అభిమానులు. కట్ చేస్తే వారి నమ్మకం నిజమైంది భరత్ అనే నేను చిత్రం తో.

శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ – కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో భరత్ అనే నేను చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి , ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సరికొత్త మహేష్ కనిపించాడు. భారీ ఓపెనింగ్స్ సాధించడంతో మహేష్ తో పాటుగా ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది.