సుధీర్ హిట్ కొట్టడంతో సంతోషంగా ఉన్న మహేష్


mahesh babu happy with sudheer babu sammohanam result

హీరో సుధీర్ బాబు సమ్మోహనం చిత్రంతో హిట్ కొట్టడంతో మహేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నాడు . నిన్న విడుదలైన సమ్మోహనం చిత్రానికి హిట్ టాక్ వచ్చింది . హిట్ టాక్ మహేష్ చెవిన పడటంతో సంతోషం వ్యక్తం చేసాడట ! అయితే మొదటి రోజున వచ్చే రిజల్ట్ కాకుండ మరో రెండు రోజుల పాటు ఎదురు చూస్తే సోమవారం నాటికీ అసలు ఏ రేంజ్ హిట్ అన్నది తెలిసిపోతుందని భావిస్తున్నాడట మహేష్ .

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సమ్మోహనం చిత్రం ప్రేమకథా చిత్రం కావడంతో యూత్ ని ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది . ఇక సుదీర్ బాబు కూడా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో సమ్మోహనం హిట్ కావడంతో చాలా సంతోషంగా ఉన్నాడు . సుధీర్ బాబు నటించిన సమ్మోహనం చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ రావడం , సినిమా చూసిన వాళ్ళు సుదీర్ ని మెచ్చుకుంటున్డటంతో మహేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నాడు .