రియ‌ల్ హీరో అనిపించుకున్న మ‌హేష్‌!


రియ‌ల్ హీరో అనిపించుకున్న మ‌హేష్‌!
రియ‌ల్ హీరో అనిపించుకున్న మ‌హేష్‌!

మ‌న స్టార్ హీరోల్లో చాలా మంది రియ‌ల్ హీరోలే. ఆప‌ద కాలంలో అభాగ్యుల‌కు అండ‌గా నిలిచిన వారే. ఇటీవ‌ల క‌రోనా క్రైసిస్ కాలంలోనూ త‌మ వంతు బాధ్య‌త‌గా ల‌క్ష‌ల్లో విరాళాలు అందించారు. ప్ర‌భుత్వాల‌కు విరాళాలు అందించ‌డ‌మే కాకుండా సినీ కార్మికుల‌కు కూడా భారీ మొత్తాల్ని ప్ర‌క‌టించి త‌మ ఉదార‌త‌ను చాటుకున్నారు. స్టార్ హీరో ప్రిన్స్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఇటీవ‌ల క‌రోనా క్రైస‌స్ ఫండ్‌కు భారీగా విరాళం అందించిన మ‌హేష్ తాజాగా ఓ చిన్నారికి ప్రాణం పోయ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.

తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన నెల రోజుల చిన్నారికి మ‌హేష్‌బాబు అండ‌గా నిలిచారు. ఈ చిన్నారి ప్రాణాన్ని కాపాడి రియ‌ల్ హీరో అనిపించుకున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లా తుమ్మ‌ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన ప్ర‌దీప్‌, నాగ‌జ్యోతి దంప‌తుల‌కు అరుదైన గుండె జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న ఓ పాప జ‌న్మించింది. నెల రోజుల ఆ పాప ప్రాణాల‌కు హాని వుంద‌ని గ్ర‌హించిన హీరో మ‌హేష్ టీమ్ వెంట‌నే మ‌హేష్‌బాబు ట్ర‌స్టు ద్వారా ఉచితంగా ఆప‌రేష‌న్ చేయించారు.

ఆంధ్రా హాస్పిట‌ల్స్‌లో ఈ ఆప‌రేష‌న్ జ‌రిగింది. ఇప్పుడు పాప ఆరోగ్యం నిల‌క‌డ‌గా వుంది. దీంతో పాప త‌ల్లిదండ్రులు మ‌హేష్‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌మ పాపుకు పున‌ర్జ‌న‌మ్మ‌నిచ్చార‌ని, రియ‌ల్ హీరో మీరంటూ క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.