గెలుపు బాటలో మహేష్ బావ


హీరో మహేష్ బాబు బావ గుంటూరు పార్లమెంట్ స్థానంలో విజయం దిశగా దూసుకుపోతున్నాడు . అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని గెల్చుకున్నాడు . తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన గల్లా జయదేవ్ గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించాడు . అయితే ఈసారి జగన్ పార్టీ నుండి విపరీతమైన పోటీ ఏర్పడింది .

ఒకదశలో మహేష్ బాబ్ బావ గల్లా జయదేవ్ గెలవడం కష్టమే అని అనుకున్నారు కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ , కృష్ణ ఫ్యాన్స్ ఆదరాభిమానాలతో పాటుగా గల్లా జయదేవ్ పార్లమెంట్ లో చూపిన పోరాట పటిమ తో విజయం సాధించాడు . అయితే తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడింది . అసెంబ్లీ ఎన్నికల్లో అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం దారుణమైన ఫలితాలను చవిచూసింది తెలుగుదేశం పార్టీ .