కఠిన నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు

Mahesh babu in very bad situation
Mahesh babu in very bad situation

బరువెక్కిన హృదయంతో ఉన్న మహేష్ బాబు కఠిన నిర్ణయం తీసుకొని కాశ్మీర్ వెళ్తున్నాడు . ఇంతకీ మహేష్ బాబు తీసుకున్న కఠిన నిర్ణయం ఏంటంటే ఒంటరిగా ఉన్న తండ్రి కృష్ణ ని ఒంటరిగానే ఉండనిస్తూ బరువెక్కిన హృదయంతో కాశ్మీర్ వెళ్ళడానికి సిద్దమయ్యాడు . ఇటీవలే విజయనిర్మల చనిపోయిన విషయం తెలిసిందే .

విజయనిర్మల చనిపోవడంతో కృష్ణ ఒంటరి వాడయ్యాడు . అయితే కర్మకాండలు నిర్వహించాల్సి ఉంది కాబట్టి అందునా తన సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంది కాబట్టి బాధతోనే షూటింగ్ కోసం తండ్రికి దూరంగా వెళ్తున్నాడు మహేష్ .రేపటి నుండి సరిలేరు నీకెవ్వరు షూటింగ్ కాశ్మీర్ లో జరుగనుంది . తండ్రి పుట్టినరోజైన మే 31న ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది . అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం రేపటి నుండి జరుగనుంది . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది .