మహేష్ బాబు బెస్ట్ అంటోన్న కృతి సనన్

మహేష్ బాబు బెస్ట్ అంటోన్న కృతి సనన్
మహేష్ బాబు బెస్ట్ అంటోన్న కృతి సనన్

సూపర్ స్టార్ మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో హీరోయిన్ గా మారింది కృతి సనన్. ఈ సినిమా ప్లాప్ అయినా కానీ మహేష్ – కృతి పెయిర్ కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేసిన కృతి సనన్, ఆపై బాలీవుడ్ చెక్కేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది.

రీసెంట్ గా కృతి సనన్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయింది కృతి సనన్. మహేష్ బాబు గురించి ఒక వర్డ్ లో చెప్పడంటూ ఒక ఫ్యాన్ కృతి సనన్ ను అడగ్గా, “మహేష్ బాబు ది బెస్ట్. నా ఫస్ట్ కో స్టార్.

చాలా హంబుల్. ఆయనొక అద్భుతం. మళ్ళీ అవకాశం వస్తే కచ్చితంగా ఆయనతో పనిచేయాలని ఉంది. (సారీ ఇది 19 వర్డ్స్ వచ్చాయి)” అంటూ కృతి సనన్ తెలిపింది.