175 కోట్ల క్లబ్ లో మహర్షి


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం 175 కోట్ల గ్రాస్ వసూళ్ల ని అధిగమించింది . మే 9 న భారీ ఎత్తున విడుదలైన మహర్షి చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించింది . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి చిత్రాన్ని అశ్వినీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే . మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించాడు .

ప్రపంచ వ్యాప్తంగా 175 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించిన మహర్షి 94 కోట్ల షేర్ సాధించింది . 100 కోట్ల షేర్ వైపు దూసుకుళ్తున్న మహర్షి చిత్రానికి సరైన పోటీ ఏది లేకపోవడంతో ఓ మాదిరి వసూళ్లు బాగానే వసూల్ చేస్తోంది . ఇక నైజాం లో అయితే 27 కోట్ల షేర్ సాధించి రంగస్థలం రికార్డ్ కు ఎసరు పెట్టింది మహర్షి చిత్రం . రేపో మాపో రంగస్థలం రికార్డ్ కనుమరుగు కావడం ఖాయమైపోయింది . అయితే మహర్షి చిత్రానికి పెద్ద మైనస్ ఓవర్ సీస్ మార్కెట్ అలాగే రాయలసీమ . ఈ రెండు చోట్ల మాత్రం బ్రేక్ ఈవెన్ కావడం లేదు దాంతో ఆ బయ్యర్లు నష్టపోతున్నారు .