టీజర్ తో దుమ్మురేపిన మహేష్


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి టీజర్ వచ్చేసింది. ఈరోజు ఉగాది పర్వదినం కావడంతో మహర్షి టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ మహేష్ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. యాక్షన్ తో పాటుగా సెంటిమెంట్ కు కూడా ప్రాధాన్యత ఇచ్చిన ఈ టీజర్ మహేష్ ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించగా అల్లరి నరేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పండగ రోజున టీజర్ తో అలరించడంతో మహేష్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.