వెబ్ సిరీస్‌కు మినీ రివ్యూ ఇచ్చిన మ‌హేష్‌!


వెబ్ సిరీస్‌కు మినీ రివ్యూ ఇచ్చిన మ‌హేష్‌!
వెబ్ సిరీస్‌కు మినీ రివ్యూ ఇచ్చిన మ‌హేష్‌!

లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌పంచం మొత్తం స్థంభించిపోయింది. సామాన్యుల ద‌గ్గ‌రి నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంతా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ ఇంటి ప‌ట్టునే వుంటున్నారు. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ కూడా లాక్‌డౌన్ ద‌గ్గ‌రి నుంచి ఇంటి ప‌ట్టునే వుంటున్నారు. త‌న పిల్ల‌లు సితార‌, గౌత‌మ్‌ల‌తో క‌లిసి కాల‌క్షేపం చేస్తున్నారు.  పిల్ల‌ల‌తో క‌లిసి గేమ్స్ ఆడుతున్నారు. సినిమాలు చూస్తున్నారు. స‌ర‌దాగా ప‌జిల్స్ లో పాల్గొంటున్నారు. హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తున్నారు.

తాజాగా ఓ వెబ్ సిరీస్‌ని చూసిన ప్రిన్స్ మ‌హేష్ ఆ వెబ్ సిరీస్‌కి మినీ రివ్యూ కూడా ఇవ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో జ‌ర్మ‌న్‌కు చెందిన `డార్క్‌` అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్‌ని చూసిన మ‌హేష్ మినీ రివ్యూ ఇచ్చారు. అద్భుత‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో ఆస‌క్తిక‌రగా ఆక‌ట్టుకునే స్క్రిప్ట్‌తో రూపొందించ‌బ‌డ్డ `డార్క్‌` వెబ్ సిరీస్ త‌న‌కు ఎంతో న‌చ్చింద‌ని, వీలైతే మీరు కూడా చూడండ‌ని మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా వెల్ల‌డించారు.

దీంతో మ‌హేష్ అభిమానుల‌తో పాటు చాలా మంది `డార్క్‌` వెబ్ సిరీస్ చూస్తున్నార‌ట‌. టైమ్ ట్రావెలింగ్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సిరీస్ ఇప్ప‌టికే నెట్ ఫ్లిక్స్‌లో సూప‌ర్ హిట్ అనిపించుకుంది. ఇద్ద‌రు టీనేజ్ పిల్ల‌లు మాయ‌మైపోవ‌డం నేథ్యంలో ఈ సిరీస్ మొద‌ల‌వుతుంది. వారిని త‌ల్లి దండ్రులు వెత‌క‌డం మొద‌లుపెడ‌తారు ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. ఆ పిల్ల‌లు ఎక్కడికి వెళ్లారు? ఏం చూశారు? వారి జీవితాల్లో ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయ‌న్న‌ది `డార్క్‌` వెబ్ సిరీస్‌లో ఆస‌క్తిక‌రం.