తగ్గితే తప్పు కాదు కానీ అభిమానులు ఊరుకోరు కదా

తగ్గితే తప్పు కాదు కానీ అభిమానులు ఊరుకోరు కదా
తగ్గితే తప్పు కాదు కానీ అభిమానులు ఊరుకోరు కదా

సంక్రాంతి పండగ ఏమో కానీ సంక్రాంతి కి వచ్చే సినిమాలకి ఇప్పటినుండే జనాలకి ఇంటరెస్ట్ వచ్చేలా చేస్తున్నారు. పండగ ఎప్పుడో 100 రోజుల ముందు ఉంది కానీ ఇప్పటినుండే రీలిజ్ డేట్స్ పెట్టేసుకొని మేము తగ్గమంటే మేము తగ్గము అని కూర్చున్నారు ఆ రాబోయే సినిమాల పెద్ద హీరోలు. మరి నిర్మాతలు సంగతి అంటే? వారు కేవలం సినిమా డేట్స్ ప్రకటించి ఎవరికీ వారు సపోర్ట్ చేసుకోవాలి అని ఒకరికి ఒకలు భజన చేసుకుంటున్నారు.

ఇప్పుడు హీరోలు ఒక డేట్ ఫిక్స్ అయ్యారంటే వారి సినిమా పరంగా సెంటిమెంట్స్ ని వారు ఫాలో అవుతారు. ఆ డేట్స్ వారికి బాగా కలిసి వస్తాయి. అందుకని ముందుకి వెనక్కి మార్చలేరు. ఒకవేళ హీరోలు తగ్గి సినిమాని ఒక రోజు ముందు కానీ వెనక్కి గాని మార్చితే పుసుక్కున ఆ సినిమా విఫలం అయ్యిందంటే మీ సినిమా చేయబట్టి మా హీరో సినిమా పోయింది అని ఆ సినిమా మీద ఇదొక కారణం వెతుక్కుని అభిమానులు కుట్ర పన్నుతారు. ఎందుకంటే అంత మంచి పోటీలో తమ హీరో ఓడిపోవటం ఏ హీరో అభిమానులు కూడా అయినా జీర్ణించుకుని ఉండలేరు కాబట్టి.

అయితే 2020 సంక్రాంతి పండగ రసవత్తరంగా సాగుతుంది సినిమాల పరంగా అని నెల రోజుల నుండి తెగ హడావిడి చేస్తున్నారు. దర్బార్, సరిలేరు నీకెవ్వరూ, అలా వైకుంఠపురములో, ఎంత మంచి వాడవురా, వెంకీ మామ. లాంటి పెద్ద సినిమాలు పోటాపోటీగా విడుదల అవ్వడం అందులో మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు మరీ అనుకొని ఒకేరోజు ప్రకటించడం అందరిని తెగ బాధపెడుతోంది. ఇంకో పక్క ఆ సినిమాలు విడుదల అయితే అవి పెద్ద సినిమాలు కనుక సినిమా టిక్కెట్ ధరలు పెంచేస్తారు.

ఓసోస్  మేము చాలా చూసాం ఇలాంటివి అన్ని! అని ఇప్పటికి జనం ఏమనుకుంటున్నారంటే ‘సినిమాలు ఒకే రోజు విడుదల డేట్ ప్రకటించడం, తీరా ఆ సినిమాలు విడుదల అయ్యే సమయానికి అందులో ఎదో ఒకటి డేట్స్ మారడం చాలా చూసాం’ అంటున్నారు సినిమాల మీద బాగా ఇష్టం ఉన్న అభిమానులు. అనుకుంటున్నట్టే మహేష్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా ఒక రోజు ముందుకి రావడం విశేషం. అవును దిల్ రాజు గారు అనిల్ సుంకర నిర్మాతలు కనుక ప్రమాదం అని జనవరి 11 న విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరి దానికి మహేష్ బాబు గారు ఒప్పుకుంటారా? అభిమానాలు ఊరుకుంటారా? అంటే ఆ దేవుడికే తెలియాలి….