మహేష్ బాబు మల్టీప్లెక్స్ రెడీ అయ్యింది


Mahesh babu new multiplex opening very soon

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు భారీ ఎత్తున రెమ్యునరేషన్ వస్తుండటంతో వాటిని పొదుపు చేసే బాధ్యత మహేష్ భార్య నమ్రత తీసుకుంది . చాలా జాగ్రత్తగా ఇప్పటికే పలు చోట్ల భూములను కొనగా తాజాగా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టారు . తెలంగాణలో ఫేమస్ అయిన ఏషియన్ ఫిలిమ్స్ వాళ్లతో కలిసి పెద్ద ఎత్తున మల్టిప్లెక్స్ లను కడుతున్నారు . ఇందులో భాగంగా గచ్చిబౌలి – కొండాపూర్ రహదారిలో పెద్ద మల్టీప్లెక్స్ రెడీ అయ్యింది , త్వరలోనే ఆ మల్టీప్లెక్స్ ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు . సకల సౌకర్యాలతో ఈ మల్టీప్లెక్స్ రెడీ అయ్యింది .

ఒక్క ఈ ఏరియాలోనే కాకుండా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లలో మరిన్ని మల్టీప్లెక్స్ లను కట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు . మహేష్ బాబుకు ఒక్కో సినిమాకు 20 కోట్ల నుండి 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ వస్తుండటంతో ఆ డబ్బుని ఇలా స్థిరాస్థుల రూపంలో భద్రపరుస్తోంది , భారీగా పెట్టుబడులు పెట్టి మహేష్ తో పాటుగా గౌతమ్ , సితార లను అపర కుబేరులుగా మార్చుతోంది నమ్రత . ఇక సినిమా విషయానికి వస్తే ……. మహర్షి సినిమాతో చాలా బిజీ గా ఉన్నాడు మహేష్ బాబు . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతోంది .

English Title: Mahesh babu new multiplex opening very soon