సుకుమార్ ని పక్కన పెట్టి అనిల్ కి ఛాన్స్ ఇస్తున్న మహేష్


Mahesh babu next confirm with anil ravipudi

మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . మహర్షి తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉండే కానీ సుకుమార్ కథ ఇంకా రెడీ కాకపోవడంతో అతడ్ని పక్కన పెట్టి అనిల్ రావిపూడి కి ఛాన్స్ ఇస్తున్నాడు మహేష్ బాబు . పటాస్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 చిత్రాలతో వరుసగా విజయాలు అందుకున్నాడు .

 

ఇటీవలే విడుదలైన ఎఫ్ 2 వసూళ్ల సునామి సృష్టించింది దాంతో అనిల్ రావిపూడి ని ప్రత్యేకంగా అభినందించాడు మహేష్ . అంతేకాదు మంచి కథ దొరికితే తప్పకుండా సినిమా చేద్దాం అన్నాడట ఇంకేముంది వెంటనే మహేష్ కోసం కథ రెడీ చేసాడు . త్వరలోనే అనిల్ – మహేష్ ల కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ కానుంది . సుకుమార్ ని పక్కన పెట్టేసి అనిల్ కు ఛాన్స్ ఇస్తున్నాడు మహేష్ .

 

English Title: Mahesh babu next confirm with anil ravipudi