మహేష్ లైనప్ చూస్తే మెంటలెక్కాల్సిందే!


మహేష్ లైనప్ చూస్తే మెంటలెక్కాల్సిందే!
మహేష్ లైనప్ చూస్తే మెంటలెక్కాల్సిందే!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ లో ఉన్న విషయం తెల్సిందే. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేష్ హ్యాట్రిక్ ను పూర్తి చేసుకున్నాడు. ఇంతకు ముందు మహేష్ చేసిన భరత్ అనే నేను, మహర్షి సినిమాలు కూడా సంతృప్తికర విజయాల్ని అందించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం మూడు నెలలు బ్రేక్ లో ఉన్న మహేష్ సమ్మర్ లో తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. ఇది తన 27వ సినిమా. దీనికి దర్శకుడిగా వంశీ పైడిపల్లి కన్ఫర్మ్ అయిపోయాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రం మే లో షూటింగ్ మొదలై నెక్స్ట్ సమ్మర్ కు రిలీజ్ అయ్యేలా కనిపిస్తోంది.

అయితే ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు సినిమాల లైనప్ ఒకసారి చూస్తే తనకు దర్శకులలో ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. మహేష్ ను దర్శకుల హీరో అంటుంటారు. కథ నచ్చితే దర్శకులకు సరెండర్ అయిపోయే అతి కొద్దిమంది హీరోల్లో మహేష్ ఒకరు. అలాంటి మహేష్ కు ఇప్పుడు దర్శకుల క్యూ ఎక్కువగానే ఉంది. వంశీ పైడిపల్లి చిత్రం పూర్తవ్వగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కానీ అనిల్ రావిపూడితో కానీ సినిమా ఉండనుంది. నిజానికి ఈ ఇద్దరు దర్శకులతో సినిమాలు ఓకే అయినా ఏది ముందు మొదలవుతుంది అనడానికి వచ్చే ఏడాదికి క్లారిటీ వచ్చే అవకాశముంది. త్రివిక్రమ్ ది ముందు మొదలైతే, అనిల్ రావిపూడిది తర్వాత అవుతుంది.

ఇక కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా సినిమా చేయాలని ప్లాన్ చేసాడు మహేష్. ఇప్పటికే ఇద్దరి మధ్య పలు మీటింగ్స్ జరిగాయి. కెజిఎఫ్ 2 మొదలైతే కానీ ఏ విషయాన్నీ చెప్పలేం. ఇక వీళ్ళే కాకుండా మురుగదాస్ కూడా మహేష్ తో మరోసారి పనిచేసి ఈసారి సూపర్ హిట్ అందివ్వాలని ప్రయత్నిస్తున్నాడు. సుకుమార్ మహేష్ తో ప్రాజెక్ట్ ను చేజార్చుకున్నాడు. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో కూడా సినిమా ఉండవచ్చు.