ప్లాస్మా డొనేషన్ పై ఫ్యాన్స్‌కు మ‌హేశ్‌ పిలుపు


Mahesh babu on his birthday made an appeal to his fans
Mahesh babu on his birthday made an appeal to his fans

సూప‌ర్ స్టార్ మ‌హేష్ పుట్టిన రోజు రేపు. ఈ సంద‌ర్భంగా ఎలాంటి హ‌డావిడి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని, సామూహిక కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌కుండా ఫిజిక‌ల్ డిస్టెన్స్‌ని పాటించండ‌ని అభిమానుల‌కు మ‌హేష్ సూచించారు. తాజా భిమానులకు మ‌రో విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఒక‌రికి ఒక‌రం స‌హ‌క‌రించుకోవ‌డం అవ‌స‌రం. క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్లాస్మా థెర‌పీ ప్రాణాల్ని కాపాడ‌టానికి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా వుంటోంది` అన్నారు హీరో మ‌హేష్‌.

సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ గారు ప్లాస్మా దానంపై ఎన్నో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారని, ప్లాస్మా డొనేట్ చేసిన వారంద‌రినీ అభినందిస్తున్నానన్నారు. ముఖ్యంగా త‌న పుట్టిన రోజు నేప‌థ్యంలో అభిమానులు ప్లాస్మా దానంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచాల‌ని, అవ‌కాశం వున్న ప్ర‌తీ ఒక్క‌రూ ప్లాస్మా దానం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా మ‌హేష్ ఫ్యాన్స్‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీమేక‌ర్స్ , 14 రీల్స్ ప్లస్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మ‌హేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్ సాంగ్‌ని రిలీజ్ చేస్తున్నారు.