యువ హీరోలతో మహేష్ ప్లానింగ్ మాములుగా లేదుగా!


యువ హీరోలతో మహేష్ ప్లానింగ్ మాములుగా లేదుగా!
యువ హీరోలతో మహేష్ ప్లానింగ్ మాములుగా లేదుగా!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాటను అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ జనవరి నుండి మొదలవుతుంది. పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించనుండగా మైత్రి మూవీస్, 14 రీల్స్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నాయి. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను ప్రెజంట్ చేయనుంది.

ఇదే జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మేజర్ సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. అడివి శేష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం 70 శాతం షూటింగ్ పూర్తయింది. మహేష్ బాబు ఇదే బ్యానర్ పై యువ హీరోలతో సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మేజర్ పూర్తైన తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేయనున్నట్లు వాదన బలంగా వినిపిస్తోంది. అలాగే మరికొందరు యువ హీరోలతో మహేష్ టీమ్ ప్రస్తుతం చర్చలు నడుపుతున్నట్లు తెలుస్తోంది.

రాజ్ తరుణ్, సిద్ధూ జొన్నలగడ్డ, సత్యదేవ్ వంటి హీరోలతో మహేష్ సినిమాలు, లేదా వెబ్ సిరీస్ లను నిర్మించే అవకాశాలు ఉన్నాయిట. మరి మహేష్ యువ హీరోలతో చేయనున్న ఈ ప్రయోగం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.