బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్లాన్ చేస్తోన్న మహేష్

mahesh babu planning two releases in six months
mahesh babu planning two releases in six months

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత కొన్ని నెలల పాటు బ్రేక్ తీసుకుని ఒప్పుకున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే  30 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. దుబాయ్ లో నెల రోజుల పాటు షూటింగ్ జరిగింది. ఆగస్ట్ కల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేసి మరో సినిమాను టేకప్ చేయాలని మహేష్ భావించాడు.

అయితే కరోనా మహేష్ ఆశలపై నీళ్లు చల్లింది. ఏదేమైనా సర్కారు వారి పాట చిత్రాన్ని అక్టోబర్ కైనా పూర్తి చేయాలని ప్రస్తుతం భావిస్తున్నాడు మహేష్. ఇప్పటికే ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపుతున్నట్లు అధికారికంగా తెలిపిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్ చిత్రాన్ని బ్రేక్ లేకుండా వెంటనే మొదలుపెట్టి 2022 సమ్మర్ కు విడుదల చేయాలని భావిస్తున్నాడు.

ఈ లెక్కన కేవలం 6 నెలల్లోనే మహేష్ బాబు తన 2 సినిమాలను విడుదల చేయాలనుకుంటున్నాడు. మరి కరోనా తన ప్లాన్స్ వర్కౌట్ అయ్యేలా చేస్తుందో లేదో చూడాలి.