కేరాఫ్ కంచరపాలెం మహేష్ కు బాగా నచ్చిందట


Mahesh babu praises C/O kancharapalem unitకేరాఫ్ కంచరపాలెం చిత్రానికి పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు లభిస్తున్నాయి . ఇప్పటికే దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి తో పాటుగా పలువురు తమతమ సందేశాలను అందించగా తాజాగా ఆ లిస్టులోకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరాడు . కేరాఫ్ కంచరపాలెం చూశానని , అద్భుతంగా ఉందని ఇది దర్శకుడి చిత్రమని పాత్రలు మలిచిన తీరు అద్భుతం అంటూనే రానా పై కూడా ప్రశంసలు కురిపించాడు . యంగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తున్న రానా ని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది అంటూ ట్వీట్ చేసాడు మహేష్ బాబు .

కొత్త దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన చిత్రం కేరాఫ్ కంచరపాలెం . అంతా కొత్తవాళ్లతో రూపొందించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటుగా పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు లభిస్తున్నాయి . ఇక దర్శకుడు వెంకటేష్ మహా కు అయితే బ్రహ్మాండమైన భవిష్యత్ ఉందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు .

English Title: Mahesh babu praises C/O kancharapalem unit