మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్

మహేష్ - రాజమౌళి ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్
మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ఉంటుందని తెలిసిన దగ్గరనుండి బజ్ భారీగా పెరిగింది. ఈ చిత్రంపై అన్ని వర్గాల్లోనూ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో వర్కౌట్ అవ్వాల్సింది కానీ వివిధ కారణాల వల్ల అలా వెనక్కి జరుగుతూ పోయింది.

మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ పూర్తయ్యాక రాజమౌళి, మహేష్ తో సినిమాను చేయనున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఏ జోనర్ లో తెరకెక్కుతుందా అన్న సందేహం అందరిలో ఉంది. దీనిపై రైటర్ విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు.

హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ స్టైల్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అన్నారు. అలాగే ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ టైపులో భారీ వ్యయంతో ఈ సినిమా ఉంటుందని అన్నారు. మహేష్ – రాజమౌళి చిత్రంపై మరిన్ని విశేషాలు అతి త్వరలోనే తెలుస్తాయి.