మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమా అది


మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమా అది
నాని మరియు మహేష్ బాబు

మహేష్ బాబు కోసం కథ రాసి వినిపిస్తే అది నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసాడు కట్ చేస్తే అదే కథని నాని కి చెప్తే నచ్చడంతో వెంటనే సినిమా చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అదే గ్యాంగ్ లీడర్ చిత్రం . మనం వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేద్దామని ప్లాన్ చేసాడు నిర్మాత అశ్వనీదత్ . అయితే మహేష్ కోసం రాసిన కథ మహేష్ కు చెప్పాడు కానీ అది నచ్చలేదట ! దాంతో రిజెక్ట్ చేసాడు మహేష్ .

ఇప్పుడు అదే కథ ని నాని తో చేస్తున్నాడు విక్రమ్ కుమార్ . అయితే నాని హీరో అనుకున్నాక కొన్ని మార్పులు చేశారట స్క్రిప్ట్ లో . ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది . అది రిలీజ్ అయ్యాక కానీ తెలీదు మహేష్ మంచి పని చేశాడా ? లేదా ? అన్నది . నాని నటించిన జెర్సీ ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించగా మహేష్ నటించిన మహర్షి మే 9 న భారీ ఎత్తున విడుదల కానుంది .