విజయ్ దేవరకొండ డైరెక్టర్ ని రిజెక్ట్ చేసిన మహేష్


Mahesh Babu
Mahesh Babu

విజయ్ దేవరకొండ తో గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన దర్శకుడు పరశురామ్ . గీత గోవిందం విడుదలై ఏడాది పూర్తయ్యింది అయితే ఇప్పటివరకు ఈ దర్శకులు మరో సినిమా సెట్ చేసుకోలేక పోయాడు . మహేష్ బాబు తో సినిమా చేయాలనీ ఆశగా ఎదురు చూసాడు కానీ మహేష్ బాబు మాత్రం కథ విన్నాకా ఈ విజయ్ దేవరకొండ డైరెక్టర్ ని రిజెక్ట్ చేసాడట .

పూర్తిగా కారణాలు తెలీదు కానీ రకరకాల ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి ఫిలిం నగర్ సర్కిల్లో . మహేష్ బాబు రిజెక్ట్ చేయడంతో పరశురామ్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారయ్యింది . గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ ని సరిగ్గా క్యాష్ చేసుకోవాల్సి ఉండే కానీ దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోకపోవడం వల్ల ఏడాది కాలం వృథా అయ్యింది . ఇప్పుడు ఈ దర్శకుడి తదుపరి స్టెప్ ఏంటో ?