గడిచింది 30 సంవత్సరాలు – మళ్లీ తిరిగొచ్చింది


Mahesh Babu tweet about Koduku Diddina Kaapuram
గడిచింది 30 సంవత్సరాలు – మళ్లీ తిరిగొచ్చింది

మన తెలుగు సినిమా పరిశ్రమ లో ఎన్నో ఎన్నో మధురానుభావాలు, తీపి గుర్తులు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు గుర్తుచేసుకుంటారు, అలాంటిది ఈ మధ్య మన “ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు” సరిగ్గా 30 సంవత్సరాల క్రితం జరిగిన విషయం తన ట్విట్టర్ ఖాతా ద్వారా నెమరువేసుకున్నారు, అదేంటో చూసేద్దాం పదండి.

సరిగ్గా 30 సంవత్సరాల క్రితం అంటే 21 సెప్టెంబర్ 1989 న విడుదల అయిన సినిమా “కొడుకు దిద్దిన కాపురం”, అందులో కథానాయకుడిగా మన సూపర్ స్టార్ “కృష్ణా”, మరియు లేడీ సూపర్ స్టార్ “విజయశాంతి” గారు నటించన సినిమా అందులో మన ప్రిన్స్ సూపర్ స్టార్ వాళ్ళ కొడుకుగా ద్విపాత్రాభినయం చేయడం మనం చూసేవుంటాం. అందులో విడిపోయిన అమ్మ-నాన్నలని మళ్లీ ఎలాగైన కలపాలి అని పరితపించే క్యారెక్టర్ మహేష్ బాబు చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

సరిగ్గా 30 సంవత్సరాల తర్వత మహేష్ బాబు తన 26 వ సినిమా గా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న “సరిలేరు నికేవ్వరు“, ఈ సినిమా ఇప్పుడు పెద్ద గొప్ప టాపిక్ గా మారింది, ఎందుకంటె దాదాపు చాలా సంవత్సరాల తర్వాత అది కూడా మళ్లీ మహేష్ బాబు సినిమా ద్వారా తన నటనకి అవకాశం రావడం “విజయశాంతి” గారికి ఇది నిజమైన మంచి పరిణామం.

ఇదంతా మనకి తెలిసిన విషయమే కాని “విజయశాంతి” గారు మళ్ళీ తనతో నటించడం అది కూడా 30 సంవత్సరాల తర్వాత అని మన మహేష్ బాబు గారు తనకి జరిగిన మధురానుభూతులు తన ట్విట్టర్ ఖాతా ద్వార ఫోటో ని షేర్ చేస్కొని తన మధురానుభవాలు నెమరువేసుకున్నారు.