`స‌రిలేరు… `కి మ‌హేష్ పారితోషికం ఎంత‌?


Mahesh Babu Remunaration for Sarileru Neekevvaru
Mahesh Babu Remunaration for Sarileru Neekevvaru

ఈ మ‌ధ్య స్టార్ హీరోలు పారితోషికం తీసుకోవ‌డం లేదు. ఆ స్థానంలో వాటాలు అడుగుతున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ద‌గ్గ‌రి నుంచి ఎన్టీఆర్ వ‌ర‌కు అంతా వాటాల పాటే పాడుతున్నారు. తాజాగా సంక్రాంతికి రిలీజ్ అయిన చిత్రాల విష‌యంలోనూ ఇదే ప‌ద్ద‌తిని హీరోలు పాటించారు. పర్సంటేజ్ ఇస్తేనే సినిమా చేస్తాన‌నే కండీష‌తో మ‌హేష్ అనిల్ సుంక‌ర‌కి `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రాన్ని చేసి పెట్టార‌ట‌. పైగా దీనికి వ‌న్ ఆఫ్ ది నిర్మాత‌గా కూడా మ‌హేష్ పేరు వేసుకున్నారు కూడా.

ఈ సంక్రాంతికి జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లనే సొంతం చేసుకుంది. అనిల్ సుంక‌ర 75 కోట్ల‌తో నిర్మించిన ఈ చిత్రం ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 300 కోట్లు వ‌సూలు చేసిన‌ట్టు తెలిసింది. టాక్ ప‌రంగా, క‌లెక్ష‌న్‌ల ప‌రంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన ఈ చిత్రం ఇండ‌స్ట్రీ హిట్ అనిపించుకుంది. ఈ సినిమాకి మ‌హేష్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. వ‌చ్చిన లాభాల్లో వాటాని మాత్ర‌మే కోరిన‌ట్టు తెలిసింది. దీంతో నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ మాత్రమే మ‌హేష్ సొంతం చేసుకున్నార‌ట‌.

దీనికి గానూ మహేష్‌కి దాదాపు 82 కోట్లు మిగిలిన‌ట్టు వార్త‌లు వినిపిస‌తున్నాయి. ఒక్కో సినిమాకు ఇప్ప‌టి వ‌ర‌కు 20 కోట్లు మాత్ర‌మే తీసుకుంటూ వ‌చ్చిన మ‌హేష్ `స‌రిలేరు..` చిత్రానికి గానూ పారితోషికం నూపంలో 82 కోట్లు ద‌క్కించుకోవ‌డం ప‌లువురిని ఆశ్చర్మానికి గురిచేస్తోంది. మ‌హేష్ త్వ‌ర‌లో వంశీ పైడిప‌ల్లితో ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్‌లో లాంఛ‌నంగా ప్రారంభం కాబోతోంది. దీనికి దిల్ రాజు నిర్మాత‌.