కూతురు డ్యాన్స్ చూసి ఖుషీ అయిన మహేష్


Mahesh babu' s Daughter Sitara
Mahesh babu’ s Daughter Sitara

మహర్షి చిత్రంలోని పాలపిట్ట అనే పాటకు తనకూతురు సితార చేసిన డ్యాన్స్ చూసి షాక్ అవుతున్నాడు మహేష్ బాబు . సితార కు చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే . మహేష్ బాబు సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేస్తూ అందరినీ సంతోషంలో ముంచెత్తుతోంది . తాజాగా మహర్షి చిత్రంలోని పాలపిట్ట అనే పాటకు బాగా డ్యాన్స్ చేసి అలరించింది .

ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . సితార ఓ యూట్యూబ్ ఛానల్ ని కూడా పెట్టుకుంది సొంతంగా . ఆ ఛానల్ కు వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి . అంటే సితార కు పాకెట్ మనీ మహేష్ బాబు కానీ , నమ్రత కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు మరి . కూతురు డ్యాన్స్ చూసి మహేష్ బాబు చాలా మురిసిపోతున్నాడు . ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు మహేష్ బాబు .

Credit: Facebook