100 కోట్ల షేర్ సాధించిన మహర్షి


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఎట్టకేలకు 100 కోట్ల షేర్ సాధించింది. మే 9 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ ఓపెనింగ్స్ ని సాధించిన మహర్షి చిత్రానికి డివైడ్ టాక్ రావడంతో వసూళ్లు మందగించాయి అందుకే 100 కోట్ల షేర్ సాధించడానికి 22 రోజులు పట్టింది మహేష్ బాబు కు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముగ్గురు నిర్మాతలు అశ్వినిదత్ , దిల్ రాజు , పివిపి లు నిర్మించిన విషయం తెలిసిందే.

నిజానికి మహర్షి చిత్రానికి బడ్జెట్ ఎక్కువ కావడంతో దాన్ని బ్రేక్ ఈవెన్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. అయినప్పటికీ ఓవర్సీస్ లో అలాగే రాయలసీమ లో మహర్షి చిత్రాన్ని తీసుకున్న బయ్యర్లు నష్టపోయారు. కానీ మిగతా ఏరియాల్లోని బయ్యర్లు మాత్రం లాభాలు గడించారు. ఎప్పుడో ఇచ్చిన అడ్వాన్స్ లు , అమెరికాలో భారీ షెడ్యూల్ షూటింగ్ వెరసి మహర్షి బడ్జెట్ పెరగడానికి కారణం అయ్యాయి. దాంతో మహర్షి వంద కోట్ల షేర్ రాబట్టినప్పటికి ఇద్దరు బయ్యర్లు మాత్రం సేఫ్ కాలేకపోయారు. ఇక ఓవర్సీస్ లో అయితే కనీసం 2 మిలియన్ డాలర్ల ని రాబట్టిలేకపోయింది మహర్షి . అయితే మహేష్ బాబు కు మాత్రం ప్రశంసలు లభించాయి.