మహేష్ బాబు మహర్షి కథ ఇదే నట

Mahesh babu 's Maharshi sroty line leaked
Mahesh babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ముగ్గురు నిర్మాతలు నిర్మిస్తున్నారు . దిల్ రాజు , అశ్వనీదత్ , పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్ర షెడ్యూల్ ఈనెలలోనే ప్రారంభం కానుంది .

ఇక తాజాగా ఈ సినిమా మూల కథ ఇదే అంటూ చక్కర్లు కొడుతోంది . భారతదేశం వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది అయితే గతకొంత కాలంగా వ్యవసాయం దండగ అనే అభిప్రాయంతో ఉన్నారు రైతులు . పంట పొలాలను అమ్మేసుకోని బ్రతుకుతున్నారు అలాగే అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు . రైతుకి సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో ఏడాది పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది . అయితే వ్యవసాయం దండగ కాదు ఆధునిక పద్దతులతో చేస్తే వ్యవసాయం పండగ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని …… ముఖ్యంగా రాయలసీమ లో వర్షాభావ పరిస్థితులు ఎక్కువ కాబట్టి దాన్ని సమన్వయం చేసే కాన్సెప్ట్ ఈ మహర్షి కథ అని తెలుస్తోంది . ఇప్పటికే టీజర్ , ఫస్ట్ లుక్ , సెకండ్ లుక్ లతో సినిమాపై అంచనాలు పెంచిన మహర్షి చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది .

English Title: Mahesh babu ‘s Maharshi sroty line leaked