టీడీపీలో చేరిన మహేష్ బాబు బాబాయ్


Mahesh babu' s uncle joins in TDP

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాబాయ్ ఆదిశేషగిరి రావు తెలుగుదేశం పార్టీలో చేరాడు . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదిశేషగిరి రావు మెడలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు . ఆదిశేషగిరి రావు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు ,ఆ ఆ తర్వాత జగన్ వెంట నడిచాడు అయితే జగన్ వ్యవహారశైలి నచ్చక తెలుగుదేశం పార్టీలో చేరాడు .

 

ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో మహేష్ బాబు పెద్ద బావ గల్లా జయదేవ్ ఉన్న విషయం తెలిసిందే . గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన గల్లా జయదేవ్ మళ్ళీ గుంటూరు నుండి పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నాడు . ఇక ఇప్పుడు మహేష్ బాబాయ్ కూడా టిడిపి లో చేరడంతో మహేష్ – కృష్ణ కుటుంబం మద్దతు తెలుగుదేశం పార్టీకే ఉంటుందని భావిస్తున్నారు . మరో రెండు , మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడి వాతావరణం వేడెక్కింది .

 

English Title: Mahesh babu’ s uncle joins in TDP