సరిలేరు నీకెవ్వరు షూటింగ్ అప్డేట్సరిలేరు నీకెవ్వరు షూటింగ్ అప్డేట్
సరిలేరు నీకెవ్వరు షూటింగ్ అప్డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి తెల్సిందే. షూటింగ్ కు బ్రేక్ రావడంతో మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి దుబాయ్ చెక్కేసాడు. ఇటీవలే మీడియాతో ముచ్చటిస్తూ నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర సరిలేరు నీకెవ్వరు, ప్రతి మహేష్ అభిమాని గర్వపడేలా ఉంటుందని చెప్పి అంచనాలు పెంచేసాడు.

మరోవైపు చిత్ర షూటింగ్ 75 శాతానికి పైగా పూర్తయిందని చెప్పారు. ఇంకా కొన్ని కీలక సన్నివేశాలు, పాటల చిత్రీకరణ మిగిలుందని అనిల్ సుంకర తెలియజేసారు. నవంబర్ లో షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. దీపావళి కానుకగా నవంబర్ లో సరిలేరు నీకెవ్వరు టీజర్ విడుదల చేసే అవకాశముంది.

మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. విజయశాంతి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లో వేసిన కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ లో షెడ్యూల్ ను పూర్తి చేసారు. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు థియేటర్లలోకి రానున్న విషయం తెల్సిందే.