సర్కారు వారి పాట షూటింగ్ షెడ్యూల్ లో మార్పు

సర్కారు వారి పాట షూటింగ్ షెడ్యూల్ లో మార్పు
సర్కారు వారి పాట షూటింగ్ షెడ్యూల్ లో మార్పు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు కూడా నిర్మాణంలో భాగం అయ్యాడు. ఈ సినిమా షెడ్యూల్ ను మొదట యూఎస్ లో చిత్రీకరించాలి అని ప్లాన్ వేసుకున్నా కానీ కోవిద్ కారణంగా దుబాయ్ కు షూటింగ్ షెడ్యూల్ ను మార్చేశారు.

దుబాయ్ లో దాదాపు నెల రోజుల పాటు తొలి షెడ్యూల్ ను షూట్ చేసారు. సెకండ్ షెడ్యూల్ ను కూడా దుబాయ్ లోనే ప్లాన్ చేసారు. మార్చ్ నెలాఖరు నుండి దుబాయ్ సెకండ్ షెడ్యూల్ మొదలుకావాల్సి ఉంది కానీ కోవిద్ సెకండ్ వేవ్ కారణంగా టీమ్ దుబాయ్ కు వెళ్ళలేదు.

తాజా సమాచారం ప్రకారం సర్కారు వారి పాట నెక్స్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే మొదలుపెట్టనున్నారు. ముందుగా హైదరాబాద్ లో షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే తెలియనుంది.