ధనుష్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన మహేష్


ధనుష్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన మహేష్
ధనుష్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన మహేష్

సినిమా చిన్నదైనా, పెద్దదైనా నచ్చితే వెంటనే స్పందించడం మహేష్ శైలి. ట్విట్టర్ లో ఆ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తుంటాడు మహేష్. ఈ మధ్య గద్దలకొండ గణేష్, సైరా చూసి స్పందించిన మహేష్ ఇప్పుడు తమిళ స్టార్ హీరో ధనుష్ ను కూడా పొగిడేసాడు. ధనుష్ హీరోగా నటించిన అసురన్ దసరా కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. 100 కోట్లు పైన గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం ధనుష్ చిత్రాల్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అంటున్నారు.

సహజ నటనతో డీగ్లామర్ రోల్ లో ధనుష్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా చూసిన మహేష్ బాబు అసురన్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. “సినిమా ఎట్ ఇట్స్ బెస్ట్” అంటూ అసురన్ ను పొగడడంతో ధనుష్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఫుల్ ఖుషీగా ఉన్న వాళ్ళు మహేష్ ను కూడా పొగిడేస్తున్నారు. సూపర్ స్టార్ ఊరికే అయిపోరు అంటూ మహేష్ ను ఎత్తేస్తున్నారు.

మరోవైపు మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు లాస్ట్ షెడ్యూల్ కు వచ్చింది. వచ్చే నెలలో చిత్రీకరణ పూర్తి చేసి సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయనున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Credit: Twitter