మహేష్ బాబు సోషల్ మీడియా టీమ్ ఇరగదీస్తోందిగా!


Mahesh Babu social media team active for Sarileru Neekevvaru

మహేష్ బాబు సోషల్ మీడియా టీమ్ ఇరగదీస్తోందిగా!
మహేష్ బాబు సోషల్ మీడియా టీమ్ ఇరగదీస్తోందిగా!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కు సిద్ధమైన సంగతి తెల్సిందే. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదల కానుంది. సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అటు ప్రేక్షకుల్లో ఇటు ట్రేడ్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన దగ్గరనుండి అటు ఫ్యాన్స్ ఇటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎప్పుడు చూద్దామా అన్న ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా నటించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా, విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత రీ ఇంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో అగ్రసివ్ గా ముందుకెళ్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతోంది. దీనికి మహేష్ బాబు సోషల్ మీడియా టీమ్ ప్రధాన కారణమన్న విషయం తెల్సిందే.

భరత్ అనే నేను చిత్రానికి ముందు మహేష్ బాబు తన సినిమాల కోసం ఒక సోషల్ మీడియా టీమ్ ను నియమించుకున్నాడు. ప్రస్తుతం సినిమా ప్రచారాలకు చాలా ముఖ్యమైన సోషల్ మీడియాలో మహేష్ సినిమాలను ముందుకు తీసుకెళ్లడం ఈ టీమ్ ప్రధాన కర్తవ్యం. మహేష్ సినిమాలపై పాజిటివ్ ఇంప్రెషన్ జనాల్లోకి బలంగా తీసుకెళ్లడం, ఏదైనా నెగటివ్ ప్రచారాన్ని అరికట్టడం విషయంలో ఈ టీమ్ ఇప్పటిదాకా సక్సెస్ అవుతూనే ఉంది. గతేడాది మహర్షి సినిమా విషయంలో పడినన్ని ట్వీట్స్ మరే ఇతర చిత్రాలకు పడలేదు. నేషనల్ లెవెల్లో టాప్ 5 లో కూడా ఈ చిత్ర కీ వర్డ్ నిలిచింది.

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు విషయంలో కూడా ఈ టీమ్ చాలా యాక్టివ్ గా ఉంది. ఈ సినిమాకు మార్కెట్ లో ప్రస్తుతం పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. అయితే ఈసారి మహేష్ చిత్రానికి పోటీ కూడా అధికంగా ఉండడంతో ఈ సోషల్ మీడియా టీమ్ ఈసారి మరింత దూకుడుగా వెళ్తోంది. ప్రస్తుతం మహేష్ వరస విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి సినిమాలు రెండూ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సక్సెస్ లలో ఈ టీమ్ పాత్ర అంతో ఇంతో ఉంది. మరి సరిలేరు నీకెవ్వరు చిత్రం విషయంలో కూడా ఈ టీమ్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.