సెట్‌లో మ‌హేష్ హంగామా మొద‌లైంది!


సెట్‌లో మ‌హేష్ హంగామా మొద‌లైంది!
సెట్‌లో మ‌హేష్ హంగామా మొద‌లైంది!

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించ‌డంతో గ‌త ఆరు నెల‌లుగా సెట్‌లోకి స్టార్ హీరోలెవ‌రూ రావ‌డం లేదు. తాజాగా బిగ్‌బాస్ కోసం కింగ్ నాగార్జున సెట్‌లో సంద‌డి చేశారు. ఆ త‌రువాత `వైల్డ్ డాగ్` మూవీ షూటింగ్‌లో పాల్గొని షాకిచ్చారు. ఇదే బాట‌లో ఆయ‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య కూడా ఇటీవ‌లే `ల‌వ్‌స్టోరీ` షూటింగ్‌ని మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే.

సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేయాల‌ని ప్లాన్ చేశారు. తాజాగా మ‌హేష్ కూడా సెట్‌లో హంగామా చేయ‌డం మొద‌లుపెట్టారు. అయితే అది యాడ్ ఫిల్మ్ కోసం. బుధ‌వారం యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొన్నారు.

దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. త్వ‌ర‌లోనే `స‌ర్కారు వారి పాట‌` షూటింగ్‌ని కూడా ప్రారంభించాల‌నుకుంటున్నార‌ని తెలిసింది.