మహేష్ బాబు వంశీ పైడిపల్లి తో కన్ఫర్మ్ ?mahesh babu vamsi paidipally
Vamsi Paidipally and Mahesh Babu

మహర్షి చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దాంతో చాలా సంతోషంగా ఉన్నాడు మహేష్ బాబు . అయితే మహర్షి సక్సెస్ కంటే ఆ సినిమా తన మనసుకి బాగా దగ్గరైన చిత్రం పైగా సందేశాత్మక చిత్రం కావడంతో వంశీ పైడిపల్లి తో బాగా అనుబంధం కుదిరింది మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కి . అందుకే మహర్షి విడుదలకు ముందే మరో సినిమా చేస్తామని ప్రకటించారు కూడా .

దానికి ఊతమిచ్చేలా వరల్డ్ కప్ టూర్ లో మహేష్ ఫ్యామిలీ తో కలిసి వంశీ పైడిపల్లి ఫ్యామిలీ కూడా వెళ్ళింది . అలాగే మహేష్ కూతురు సితార కు వంశీ పైడిపల్లి కూతురు మంచి ఫ్రెండ్ కూడా అయ్యింది . ఇక సితార జన్మదిన వేడుకల్లో వంశీ పైడిపల్లి కూడా పాల్గొన్నాడు . దాంతో 2020 లో కానీ 2021 లో కానీ వంశీ తో మళ్ళీ మహేష్ బాబు సినిమా చేయడం ఖాయమని తెలుస్తోంది .